ఎన్టీఆర్ తో కుర్ర హీరోయిన్ ఆటపాట..!

Festive news for NTR fans..!
‘దేవర’ సినిమాతో గత ఏడాది తన అభిమానులను అలరించారు పాన్ ఇండియా స్టార్ హీరో జూ.ఎన్టీఆర్. పాన్ ఇండియా మూవీగా విడుదలై సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ మూవీ అనంతరం సూపర్ సక్సెస్ అందుకున్న ఘనత ఎన్టీఆర్ కే చెందుతుంది.
ఎన్టీఆర్ నుండి మరో సినిమా ఈ ఏడాది రానుంది. ఈ సారి ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘వార్ 2′ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ కానుంది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇందులో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపిస్తారని తెలిసింది. హృతిక్ రోషన్ తో ఉండే యాక్షన్ సన్నివేశాలు హైలెట్ అవుతాయని అంటున్నారు.
అలాగే ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ మంచి డాన్సర్లు అనే విషయం తెలిసిందే. హీరోలిద్దరి కలయికలో ప్రత్యేక గీతం ఉంటుందని, ఈ పాటలో బాలీవుడ్ నటి శద్దాకపూర్ నటిస్తుందని తెలిసింది. ఈ పాట సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిం చవచ్చు. కియారా అద్వానీ నాయికగా నటిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది.