స్పీడ్ పెంచిన మెగాస్టార్..!

chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర” చిత్రాన్ని పూర్తిచేసి కొత్త సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించి ఈ సినిమాను సాహు గారపాటి, కొణిదెల సుష్మిత సంయుక్తంగా నిర్మించనున్నారు.
శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం ‘ది పారడైజ్ ‘ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో నాని కథానాయకుడు. ఈ చిత్రం పూర్తిచేసిన అనంతరం చిరంజీవి సినిమాను ప్రారంభించే అవకాశం ఉందని తెలిసింది. చిరంజీవి సినిమాకు సంబంధించి కథా చర్చలను ఇదే నెలలో మొదలుపెడతారని తెలిసింది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు.
చిరంజీవితో ఆయన తీసే సినిమా వినోదాత్మకంగానే ఉంటుందని, చాలా కాలం తర్వాత ఈ తరహాసినిమా చేస్తున్నట్టు చిరంజీవి సైతం అంటున్నారు. ‘’సంక్రాంతికి వస్తున్నాం’ వంటి మూడు వందల కోట్లు వసూలు చేసిన సినిమాను అందించిన అనిల్ రావిపూడి మెగాస్టార్‌తో చేసే సినిమా ప్రతిష్టాత్మకమైనదే. ఈ కాంబినేషన్ పట్ల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. చిరంజీవి సైతం ఈ తరహాసినిమాలు చేసి చాలాకాలమైంది.
