హోం గార్డుల జీతాలు రైతుభరోసాకి తరలించారా..?

Bad news for Krishna train passengers!
తెలంగాణ రాష్ట్రంలోని హోం గార్డులకు చెల్లించాల్సిన సుమారు నలబై ఏడు కోట్ల రూపాయల వేతనాలను రైతు భరోసా కి తరలించారా..?. ఇప్పటికే నిధుల్లేవని సాకులు చెబుతూ రైతు భరోసాపై రోజుకో మాట మారుస్తున్న మంత్రులు..అధికార పార్టీ నేతలు ఇలా ఆలోచిస్తున్నారా..?. అంటే అవుననే టాక్ విన్పిస్తుంది. మాములుగా హోం గార్డులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మొత్తం వేతనాలను ఆర్ధిక శాఖ విడుదల చేస్తుంది.
ఇప్పటికే విడుదలైన నిధుల్లో ఫిబ్రవరి నెలకు అందాల్సిన నలబై ఏడు కోట్ల రూపాయలను అత్యవసరంగా రైతు భరోసాకు మళ్లించిన నేపథ్యంలో వేతనాలు మరింత ఆలస్యమవుతాయని హోంగార్డు వర్గాల్లో విన్పిస్తున్న వార్తలు. ఇప్పటికే ఫిబ్రవరి పన్నెండో తారీఖు వచ్చిన ఇంకా జీతాలు పడకపోవడంతో హోం గార్డులు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తుంది.
ఇంటి అద్దెలు.. పిల్లల స్కూళ్ల ఫీజులు.. నెల ఖర్చులు.. బ్యాంకుల ఈఎంఐలు ఇలా పలు ఆర్థిక అవసరాలతో అప్పులు చేయాల్సి వస్తుంది. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారుతుందని వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదహారు వేల మంది హోం గార్డులు ఉన్నారు. ఈ వార్తలపై ఇటు ఆర్థిక శాఖ. అటు డిపార్ట్మెంట్ క్లారిటీవ్వాల్సి ఉంది.
