కూటమి పాలనలో సెలబ్రేటీలకు ఓ న్యాయం- సామాన్యులకు ఓ న్యాయం..!

ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో సెలబ్రేటీలకు ఓ న్యాయం.. సామాన్యులకు ఓ న్యాయం జరుగుతుంది. గతంలో ప్రముఖ బాలీవుడ్ నటి కాదంబరి జైత్వానీ విషయంలో చాలా వేగవంతంగా స్పందించింది కూటమి ప్రభుత్వం. ఏకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను విధులనుండే సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆ అధికారులు న్యాయస్థానాలను ఆశ్రయించి ఉపశమనం పొందారు అది వేరే విషయం అనుకోండీ.
కానీ తాజాగా ఏపీ పాలిటిక్స్ ను హీటేక్కిస్తున్న అంశం తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ వ్యవహరం. తనకు అన్యాయం జరిగింది. దాదాపు కోటీన్నర రూపాయల నష్టం జరిగింది లక్ష్మీ అనే ఓ మహిళ మీడియా ముందుకు వచ్చి గోడు విన్పించుకున్న కానీ పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం. ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఆమెనే దోషిగా నిలబెట్టింది.
అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు బాధితులా.. కాదా అని మాత్రమే చూస్తారు తప్పా దోషులా.. నిర్ధోషులా చూడరు.కానీ కిరణ్ రాయల్ వ్యవహారంలో మాత్రం లక్ష్మీని దోషి.. చాలా మందిని చీట్ చేసింది కేసులు పెట్టి మరి అరెస్ట్ అయ్యేలా పావులు కదిపారు. మరి లక్ష్మీకి జరిగిన అన్యాయం పై ఎవరూ స్పందిస్తారు అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు జనసేన నేత కిరణ్ రాయల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని మరి బయట దర్జాగా తిరుగుతున్నాడు. అయిన కూటమి పాలనలో సెలబ్రేటీలకు ఓ న్యాయం.. సామాన్యులకు ఓ న్యాయం అని విమర్శలు వస్తున్నాయి.
