త్వరలోనే జమిలీ ఎన్నికలు..!

Big update on Pushpa-3..!
వన్ నేషన్.. వన్ ఎలక్షన్ తీసుకురావాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఆలోచిస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా జమిలీ ఎన్నికల గురించి ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేపటీతో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రంలో మనకు పూర్తి సహాకారం ఉంది. బడ్జెట్ లో కూడా నిధులు ఎక్కువగా కేటాయించారు.
పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తాము. దీనికి అన్ని విధాలుగా కేంద్ర సర్కారు అండగా ఉంటుంది. 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయి. అప్పటివరకు ప్రజలకిచ్చిన ప్రతి హామీని నేరవేరుస్తాము అని కుండబద్ధలు కొట్టారు.
