ఆడబిడ్డ అని చెత్తబుట్టలో వేశారు..చివరకి..!

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ లీసా స్తాలేకర్ మీకు గుర్తున్నారా?.. ఈమెది ఇండియానే. ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు చెత్తబుట్టలో పడేస్తే అనాథ శరణాలయం చేరదీసింది.
ఓ ఆస్ట్రేలియన్ కుటుంబం దత్తత తీసుకోవడంతో ఆమె న్యూసౌత్ వేల్స్కు వెళ్లారు. క్రికెట్లో అనేక సవాళ్లను ఎదుర్కొని ఆసీస్ మహిళా జట్టుకు కెప్టెన్ అయ్యారు..
ఆ తర్వాత ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డునూ గెలిచారు. ఈమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని నెటిజన్లు సోషల్ మీడియా తెగ ట్రెండ్ చేస్తున్నారు.
