అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి కారణమైన ఓ కొడుకు పగ..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీ నలబై ఎనిమిది స్థానాల్లో గెలుపొంది దాదాపు ఇరవై ఏడు వసంతాల తర్వాత అధికార పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెల్సిందే. మరోవైపు ఆప్ పార్టీ కేవలం ఇరవై రెండు స్థానాల్లోనే విజయడంకా మ్రోగించింది.
ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రులు మనిష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లాంటి ఆప్ అగ్రనేతలు సైతం ఓడిపోయారు.అయితే కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్టుగా న్యూఢిల్లీ సీట్లో అరవింద్ కేజీవాల్ ఓటమికి ఓ కొడుకు పగ సైతం కారణమైంది..
అప్పట్లో 1998, 2003, 2008 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హ్యాట్రిక్ కొట్టారు. 2013లో ఆమెను ఓడించి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ 3 సార్లు గెలిచిన అధికారాన్ని చెపట్టడమే కాదు ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయ్యారు.
కానీ ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ 4089 ఓట్లతో ఓడారు. మాజీ ముఖ్యమంత్రి షీలా కొడుకు సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ పై బరిలోకి దిగారు.
ఆయనకు ఇక్కడ వచ్చిన ఓట్లు 4568. ఈ ఓట్లను సైతం సందీప్ దీక్షిత్ కనుక చీల్చకపోతే కేజ్రీవాల్ దే విజయం. ఇలా తన తల్లి ఓటమికి ఆయన ప్రతీకారం తీర్చుకున్నారు అని కాంగ్రెస్ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
