నిబంధనలు పాటిస్తేనే భవన నిర్మాణ అనుమతులు:

బల్దియా పరిధిలోని హనుమకొండ వరంగల్ ప్రాంతాలలో నిర్మాణాల అనుమతుల మంజూరు కోసం దరఖాస్తులు సమర్పించిన నేపథ్యం లో కమిషనర్ క్షేత్ర స్థాయి లో పర్యటించి పరిశీలించారు.
భవన నిర్మాణ అనుమతుల కోసం హన్మకొండ పరిధి లో హంటర్ రోడ్, కాకతీయ యునివర్సిటీ సమీపం లోగల శ్రీ సాయినగర్ కాలనీ వరంగల్ పరిధి మెట్ల బావి ఆరేపల్లి ప్రాంతాలలో కమిషనర్ పర్యటించి కొలతలు వేసి పరిశీలించారు.
ఈ సందర్భం గా కమిషనర్ మాట్లాడుతూ నగరవాసులు భవన నిర్మాణాలు చేపట్టడానికి టిజీ-బిపాస్ ద్వారా అనుమతుల జారీ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, వారు నమోదు చేసిన వివరాలు సరి పోల్చుకొని వాస్తవ సమాచారం నమోదు జరిగిందో లేదో తెలుసుకొని చట్టం లో పేర్కొన్న నిబంధనల మేరకు నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తే, బడా భవన నిర్మాణాలకు అక్యుపెన్స్ సర్టిఫికెట్ తో పాటు నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తామని కమిషనర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడెకర్ ఏసీపీ రజిత తదితరులు పాల్గొన్నారు.
