మళ్లీ వెనకబడిన కేజ్రీవాల్..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన ఆప్ పార్టీ చీఫ్ .. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏడో రౌండ్ తర్వాత మళ్లీ వెనకబడ్డాడు.
బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ కేజ్రీవాల్ పై ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారిపోతున్నాయి.
కేజ్రీవాల్ పై 1170ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు. మరోవైపు బీజేపీ నలబై ఐదు.. ఆప్ ఇరవై ఐదు స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది.