ఆధిక్యంలో బీజేపీ..!

Do you need an American visa?
ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి వెలువడుతున్నాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కించారు.
ఉదయం నుండే బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పటివరకూ వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నలబై రెండు స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది.
మరోవైపు అధికార పార్టీ ఆప్ ఇరవై ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ ఖాతా తెరవలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో బీజేపీ ఆప్ ల మధ్య హోరాహోరి నడుస్తుంది.
