కాలేజీ క్రష్ నుండి నేషనల్ క్రష్ గా రష్మిక మందన్న.!
ఆమె నేషనల్ క్రష్. ఎంతోమంది యువతకు ఆమె ఆరాధ్య దైవం. సినిమాల్లో కన్పించిన.. బయట ఎక్కడైన ఏదైన కార్యక్రమంలో కన్పించిన యువత ఆనందానికి అవధుల్లేవు. ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా..?. నేషనల్ క్రష్ అనగానే మీకు ఠక్కున ఎవరూ గుర్తుకు వస్తారు.
ఇంకా ఎవరూ రష్మిక మందన్న. ఆమె గురించే ఇదంతా.. తాజాగా రష్మిక మందన్న ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ తాను చదువుకునే రోజుల్లో కళాశాలలో చాలామందికి తనపై క్రష్ ఉండేదని తెలిపారు. ఆ తర్వాత దేశం మొత్తానికి క్రష్ గా మారానని చెప్పారు.
తాను నటించిన కన్నడ సినిమా అయిన “కిరిక్ పార్టీ తర్వాత నేషనల్ క్రష్ ట్యాగ్ ఈ ముద్దుగుమ్మకు వచ్చింది. ఈ ట్యాగ్ దేశం మొత్తం పాకిపోయింది. ప్రస్తుతం దేశ ప్రజలందరూ నన్ను ప్రేమిస్తున్నారు. ఇది నాకు చాలా ప్రత్యేకంగా ఉంది’ అంటూ ఈ హాట్ బ్యూటీ చెప్పుకొచ్చారు. రష్మిక కాలి గాయంతో బాధపడుతూ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు.