జనసేనకు శుభవార్త..!

janasena
4 total views , 1 views today
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసైనికులకు ఇది నిజంగానే శుభవార్త. తాజాగా జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన సంగతి మనకు తెల్సిందే.
ఇప్పుడు తెలంగాణలోనూ గుర్తింపునిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఉత్తర్వులిచ్చింది. మరోవైపు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును జనసేనకు ఈసీ కేటాయించింది.
2024లో ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు గెలిచిన విషయం తెలిసిందే. దీంతో రిజిస్టర్డ్ పార్టీ హోదా నుంచి గుర్తింపు పొందిన పార్టీగా మారింది. ఇకపై గాజు గ్లాసు చిహ్నాన్ని ఎవరికీ కేటాయించరు.
