విజయ్ దేవరకొండ కొత్త మూవీ టైటిల్ ఇదేనా..?

Vijay Devarakonda
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. రౌడీ ఫెలో విజయ దేవరకొండ హీరోగా జేర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సరికొత్త మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే.ఈ చిత్రం టైటిల్ ఏమటన్నది ఇటు విజయ్ అభిమానులు.. అటు సినీ ప్రేక్షకుల మదిలో తీవ్ర అసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ సినిమాను సితార ఎంటర్ ట్రైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరో విజయ్ దేవర కొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కన్పించనున్నారు అని తెలుస్తుంది.
ఈ సినిమాకు సంబంధించిన గతంలో విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ చిత్రానికి సామ్రాజ్యం అనే టైటిల్ అని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై చిత్రం యూనిట్ అధికార ప్రకటన చేయాల్సి ఉంది.
