రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసిన కలెక్టర్
తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ కు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్థిక సాయం అందజేశారు. నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ లలిత దంపతుల పాప బుధవారం ప్రమాదవశాత్తు మరణించగా, బాధిత కుటుంబానికి బుధవారం రాత్రి తక్షణ సహాయం కింద రూ. లక్ష అందజేశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం రూ. మరో లక్ష రూపాయల చెక్కును అందజేశారు.