తగ్గిన బంగారం ధరలు..!
నిన్న మొన్నటివరకు ఆకాశాన్నంటిన బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గింది.
దీంతో పది గ్రాముల బంగారం ధర రూ.84,050కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.400 తగ్గి రూ.77,050గా నమోదైంది.
అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. కేజీ వెండి ధర రూ. 1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.