ఏకంగా సీఎం చంద్రబాబు భూమినే కబ్జా..?
భూమాఫియా బరితెగించింది. ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి స్థలంపైనే కన్నువేసింది.
25 ఏళ్ల కిందట బాపట్లలో తెలుగు దేశం పార్టీ ఆఫీస్ కోసం ఓ వ్యక్తి చంద్రబాబు పేరిట 9.5 సెంట్లు రిజిస్టర్ చేయించారు.
కాలక్రమంలో దీని విలువ రూ.1.50 కోట్లకు చేరడంతో అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. తాజాగా ఆ పత్రాలతో బ్యాంకు రుణం కోసం ప్రయత్నించగా మోసం బయటపడింది. బాపట్ల ఎమ్మెల్యే ఫిర్యాదుతో సత్తార్రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు