డాకు మహారాజ్ సరికొత్త రికార్డు..!
తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు బాబీ నేతృత్వంలో సీనియర్ స్టార్ హీరో.. నందమూరి బాలకృష్ణ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కానుకగా విడుదలైన మూవీ డాకు మహారాజ్. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ చిత్రం తాజాగా సరికొత్త చరిత్ర సృష్టించింది.
హీరో బాలయ్య కెరీర్లోనే అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచినట్లు ఈ మూవీ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.
అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించినట్లు పేర్కొంది. బాలయ్య వేటకు వెళితే ఇలాగే ఉంటుందని రాసుకొచ్చింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా రూ.156 కోట్లకు పైగా వసూలు చేసింది.