పవన్,లోకేష్ ల మధ్య కోల్డ్ వార్..సీఎం ఎవరు..?
ఏపీలో తిరుపతిలో తొక్కిసలాట తరువాత రాజకీయాలు చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి.అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం జరిగింది.ఇది అటుంచితే అధికారంలో ఉన్న కూటమి పక్షాల మధ్యే మాటల యుద్దం జరగటం ఆశ్చర్యంగా మారింది.తొక్కిసలాట జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించి వారికి దైర్యం చెప్పారు..అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అక్కడకి వెల్లి వారిని పరామర్శించి టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు.
ఈ వాఖ్యలపై విభిన్న వాధనలు కొనసాగాయి.టీటీడి చైర్మన్ సైతం పవన్ కు వ్యతిరేఖంగా మాట్లాడారు.ఒక మీడియా ప్రతినిది అడిగిన ప్రశ్నకు ఐటీ మినిస్టర్ లోకేష్ సైతం పవన్ ది వ్యక్తిగత అభిప్రాయమని టీడీపీ స్టాండ్ అది కాదని అన్నారు.దీంతో అక్కడే అగ్గి రాజుకుంది..లోకేశ్ వాఖ్యల తర్వాత జనసేన, టీడీపీ మద్య యుద్దవాతావరణం నెలకొంది.ట్విట్టర్,ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు,టీడీపీ అభిమానుల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది.
పనన్ కాబోయే సీఎం అంటూ,పవన్ వల్లే కూటని అదికారంలోకి వచ్చిందని అతని అభిమానులు,జనసేన నాయకులు మాట్లాడుతుంటే,పవన్ కు డిప్యూటీ సీఎం పదవే ఎక్కువ అని,కాబోయే సీఎం లోకేష్ అంటూ టీడీపీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు..ఇటివల పవన్ వ్యవహారశైలి టీడీపీకి వ్యతిరేఖంగా ఉండటం,కూటమిలో లుకలుకలు ఏర్పడుతుండటం,పవన్ స్వతంత్రంగా పనిచేస్తూ సొంత నిర్ణయాలు తీసుకుంటుండటం టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయకుడు భవిశ్యత్ నాయకుడిగా కీర్తిస్తున్న లోకేష్ కు ఏమాత్రం నచ్చలేదట,అందుకే ఇక పవన్ తో అమితుమి కి సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది.అయుతే పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోదీ అండదండలు ఉండటంతో కాస్త వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది..మరి ఈ యవ్వారం ఎంత దూరం వెలుతుంది..? కాబోయే సీఎం ఎవరు అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే..!!