సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల సునామీ..!

సంక్రాంతి హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.
విక్టరీ వెంకటేష్ హీరోగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహారించాడు..భీమ్స్ సంగీతం అందించాడు. ఇప్పటివరకు ఈ చిత్రం 150+కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది..
విడుదలైన ఐదు రోజుల్లోనే వంద కోట్లను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. నిన్న ఇవాళ వీకెండ్ కావడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సినీ పండితులు చెబుతున్నారు.