తెలంగాణలో మరో ఉప ఎన్నిక..?
తెలంగాణలో మరో ఉప ఎన్నిక రానుందా..? మరోసారి ఎన్నికల శంఖారావం జరగనుందా..? అంటే అవుననే సమాదానం వినిపిస్తుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావ్ కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. తెలంగాణ హైకోర్టులో తనపై దాఖలైన ఎన్నికల అఫిడవిట్ పిటిషన్ ను రద్దుచేయాలని గతంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసారి ఎమ్మెల్యే కూనంనేని.సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ ను విచారించింది.
వాదోపవాదనలు విన్న తదనంతరం కూనంనేని దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది సుప్రీం ధర్మాసనం.గతంలో హైకోర్టులో దాఖలు చేసిన ఇంటర్ ఇమ్ అప్లికేషన్ ను నిరాకరిస్తూ జస్టిస్ కె. లక్ష్మణ్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం ధర్మాసనంసమర్థించింది.ఎన్నికల అఫిడవిట్ కేసులో వాదనలు ఎదుర్కొనేందుకు ఎమ్మెల్యే కూనంనేని సిద్ధంగా ఉండాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫార్మ్ -26 ఎన్నికల అఫిడవిట్ లో సమగ్ర వివరాలు వెల్లడించలేదని ఎమ్మెల్యేగా కూనంనేని ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో కొత్తగూడెంకు చెందిన నందులాల్ అగర్వాల్ ఎన్నికల పిటిషన్ దాఖలు చేసారు. రిటర్నింగ్ అధికారికి సమర్పించిన ఫార్మ్ 26 అఫిడవిట్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూనంనేని తన భార్య పేరును పేర్కొనలేదని , లైసెన్స్ డు నోటరీతో అఫిడవిట్ చేయించలేదని ఎన్నికల పిటిషన్ లో నందులాల్ అగర్వాల్ పేర్కొన్నారు.దీంతో ఇప్పుడు కూనంనేనిపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి.మరి కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.