స్టార్ హీరో పై దాడి
బాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడు.
ఈరోజు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆ దుండగుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. హీరో సైఫ్ అలీఖాన్ ఆ దుండగుడితో పోరాడటంతో కత్తితో అతనిపైకి దాడికి తెగబడ్డాడు.
మొత్తం ఆరు చోట్ల తీవ్ర గాయలైనట్లు తెలుస్తుంది.న్యూ ముంబై లోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ కు చికిత్స చేస్తున్నారు.దాడికి దిగిన వ్యక్తి దొంగ గా పోలీసులు అనుమానిస్తున్నారు.