హీరో వెంకటేష్ పై కేసు నమోదు..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ , యువహీరో దగ్గుబాటి రానా, ప్రముఖ నిర్మాత .. నటుడైన దగ్గుబాటి సురేష్ బాబు లపై హైదరాబాద్ మహానగరంలోని ఫిల్మ్ నగర్ లో కేసు నమోదైంది.
ఫిల్మ్ నగర్ లో డెక్కన్ కిచెన్ కూల్చివేతపై ఈ ముగ్గురిపై కేసు నమోదైంది. సిటీ సివిల్ కోర్టులో ఈ అంశం పెండింగ్ లో ఉంది.
అయిన కానీ డెక్కన్ కిచెన్ కూల్చివేశారని దాన్ని లీజుకు తీసుకున్న నందకూమార్ నాంపల్లి కోర్టుకెళ్ళారు. దీంతో వారిపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఫిల్మ్ నగర్ పోలీసులను ఆదేశించింది. దీంతో సెక్షన్లు 448,452,458,120B కింద పోలీసులు కేసు నమోదు చేశారు.