అభిమాని వెర్రికి పరాకాష్ట ఇది.!
![అభిమాని వెర్రికి పరాకాష్ట ఇది.!](https://www.singidi.com/wp-content/uploads/2025/01/images-7.jpeg)
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో ..గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైంది.. అటు ఏపీ ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలు థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు.
అయితే, ఏపీలోని అనంతపురంలో ఓ థియేటర్ వద్ద ఓ అభిమాని బ్లేడుతో చేయి కోసుకొని మరి మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ప్లెక్సీలకు రక్త తిలకం దిద్దారు.
అంతేకాకుండా’జై చరణ్’ అంటూ నినాదాలు చేశారు. అభిమానులు ఇలా చేయకూడదని, ఇలాంటివి హీరోలు సైతం ఎంకరేజ్ చేయరు..ఇది అభిమానానికి పరాకాష్ట.ఇలాంటి చర్యలు మానుకోవాలని నెటిజన్లు ఫైరవుతున్నారు.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)