నేడు విశాఖ లో మోదీ పర్యటన..!
ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఈరోజు బుధవారం విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. దాదాపు రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు కూటమి పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు.
ముందు ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లతో కల్సి ప్రధాని మోదీ భారీ రోడ్ షో చేయనున్నారు.
అనంతరం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరగనున్న భారీ బహిరంగ సభాస్థలికి వారు చేరుకుంటారు. సాయంత్రం 4.15గంటలకు విశాఖపట్టణం చేరుకోనున్న ప్రధాని బహిరంగ సభ,శంకుస్థాపనలను ముగించుకుని రాత్రి 7.15గంటల ప్రాంతంలో తిరుగు పయనమవుతారు.