రాజకీయాల్లోకి త్రిష..!
దాదాపు రెండు దశాబ్ధాల నుండి ఇటు తెలుగు. అటు తమిళ సినీ ప్రేక్షకులను అలరిస్తున్న బక్కపలచు భామ.. చెన్నై అందాల రాక్షసి త్రిష. త్రిష త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నరా..?. ఎమ్మెల్యే .. మంత్రి కాదు ఏకంగా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారా..?. అంటే అవుననే అంటున్నది ఈ ముద్దుగుమ్మ.
ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో త్రిష మాట్లాడుతూ నాకు ముఖ్యమంత్రి కావాలనే కల ఉంది. రాజకీయాల్లోకి వస్తే ఇటు ప్రజలకు సేవ తో పాటు అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను అందించవచ్చు . ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం అని అమ్మడు కుండ బద్ధలు కొట్టినట్లు తెలిపారు.
దీంతో తమిళనాట సినిమావాళ్ళు ముఖ్యమంత్రులైన చరిత్ర ఉన్నందున త్వరలో ఈ ముద్దుగుమ్మ రాజకీయంలోకి రావడం.. ముఖ్యమంత్రి కావడం ఖాయం అని ఆమె అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ప్రస్తుతం స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టిన సంగతి మనకు తెల్సిందే.