వరంగల్ కాంగ్రెస్ లో ముసలం..
వరంగల్ కాంగ్రెస్ లో ముసలం రాజుకుందా..? నాయకల మద్య విబేదాలు తారా స్థాయికి చేరాయా..? అంటే అవుననే సమాదానం వినిపిస్తుంపి..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క కనిపించకపోవడం అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి..
గీసుకొండ మండలం మొగుళ్లపల్లి దగ్గర 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు..డిప్యూటీ సీఎం పర్యటనలో ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి ఎక్కడా కనిపించలేదు. సమావేశం కూడా అంత చప్పగా సాగినట్టు సమాచారం..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగం కొనసాగుతుండగానే ప్రజలు వెల్లిపోయారు.సభ ప్రాంగణంలో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో వరంగల్ కాంగ్రెస్ లో సఖ్యత లేదని భట్టి అభిప్రాయపడినట్టు ఓకింత అసహనం వెల్లబుచ్చినట్టు తెలుస్తుంది..