తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు శుభవార్త..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన కాంగ్రెస్ శ్రేణులకు శుభవార్తను తెలిపారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు.. ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్. మేడ్చల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే.. మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పీసీసీ ప్రతినిధి దేప భాస్కర్‌రెడ్డిలు టీపీసీసీ చీఫ్.. ఎమ్మె;ల్సీ మహేష్ కుమార్‌గౌడ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్‌గౌడ్‌తో కేఎల్‌ఆర్, దేప భాస్కర్‌రెడ్డిలు భేటీ అయ్యారు.. ఈ భేటీలో మహేశ్ కుమార్ మాట్లాడుతూ త్వరలో అన్ని రాజకీయ పదవులను భర్తీ చేస్తామని హామీచ్చినట్లు తెలుస్తుంది.
కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే . పార్టీ పదవులు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు, పార్టీ గెలిచే అంశాల పై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తామని మహేష్ కుమార్‌గౌడ్ వారికి హామిచ్చారు.