నటి సీత ఇంట్లో విషాదం..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ హీరోయిన్.. నటి అయిన సీత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆమె తల్లి చంద్రమోహాన్ (88)ఈరోజు కన్నుమూశారు.
తమిళ నాడు చెన్నైలోని సోలిగ్రామంలోని తన స్వగృహాంలో గుండె సంబంధిత సమస్యలతో ఆమె తుది శ్వాస విడిచినట్లు తెలుస్తుంది.
చంద్రమోహాన్ అసలు పేరు చంద్రావతి. పెళ్లైయాక ఆమె పేరును మార్చుకున్నారు. సీత పలు తెలుగు తమిళ సినిమాలతో పాటు ప్రస్తుతం కొన్ని పాపులర్ సీరియళ్లలో సైతం నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు.