పీకల్లోతు కష్టాల్లో భారత్…!
సిడ్నీ వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ ఐదో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఈరోజు రెండో సెషన్ లో 181పరుగులకు ఆలౌటైన సంగతి తెల్సిందే. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకు ఆలౌటైన సంగతి తెల్సిందే.
దీంతో ఆసీస్ నాలుగు పరుగుల వెనకంజలో ఉంది. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు, మహ్మాద్ సిరాజ్ మూడు వికెట్లు,బూమ్రా రెండు,నితీశ్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీశారు. ఆసీస్ జట్టులో అరంగ్రేటం చేసిన వెబ్ స్టర్ యాబై ఏడు పరుగులు, స్మిత్ ముప్పై మూడు పరుగులతో రాణించారు.
రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. విరాట్ కోహ్లీ ఆరు పరుగులకు, శుభమన్ గిల్ పదమూడు పరుగులకే వెనుదిరిగిపోయారు. తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం కలుపుకోని మొత్తం ఎనబై రెండు పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు నాలుగు వికెట్లను కోల్పోయి డెబ్బై ఎనిమిది పరుగులు చేసింది.