పుష్ప -2 రికార్డుల మోత..!
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా… నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా… అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ఇటీవల విడుదలైన లేటెస్ట్ మూవీ పుష్ప 2.
ఈ సినిమా ఎన్ని వివాదాలకు తావిచ్చిందో అంతే స్థాయిలో రికార్డుల మోత మ్రోగిస్తున్నది. తాజాగా కెనాడాలో 4.13 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898ఏడీ కలెక్షన్లను అధిగమించింది.
కెనాడాలో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సౌత్ ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. మొత్తంగా మూవీ రూ.1800కోట్ల మార్కును దాటిన సంగతి తెల్సిందే.