ఆ 4గురికి ఖేల్ రత్న అవార్డులు..!
Sports : నలుగురికి ఖేల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరికి ఈ నెల పదిహేడో తారీఖున రాష్ట్రపతి ముర్ము అందజేయనున్నారు.
అంతేకాకుండా మరో ముప్పై రెండు మందికి అర్జున అవార్డులను సైతం కేంద్రం ప్రకటించింది. ఖేల్ రత్న అవార్డులు వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్,ఒలింపిక్స్ షూటింగ్ విజేత మనుబాకర్,హాకీ క్రీడాకారుడు హర్మన్‌ప్రీత్‌సింగ్,పారా అథ్లెటిక్ ప్రవీణ్‌కుమార్‌లకు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 17 మంది పారా అథ్లెటిక్స్‌కు అవార్డులను కూడా ఇవ్వనున్నది.