కొత్త ఏడాది… అమ్మాయిలకు హీరోయిన్ హెచ్చరిక..!
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి మాధవీలత అమ్మాయిలకు హెచ్చరికలు ఇస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో క్యాలెండర్ లో డేట్ మారినంత మాత్రాన మన జీవితాలు ఏమి మారవు.. 2024లో కష్టాలు ఉన్నాయి..
డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఫుల్ గా ఎంజాయ్ చేస్తే కొత్త ఏడాదిలో అన్ని రోజులు మంచిగా ఉంటాయనుకోవడం మూర్ఖత్వం. డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు ఆర్ధరాత్రి వరకు ఫుల్ గా తాగడం.. డ్రగ్స్ తీసుకోవడం తప్పు. అమ్మాయిలు మీరు జాగ్రత్త.. ఒళ్ళు మరిచిపోయేంతగా తాగోద్దు..
తాగిన మైకంలో మీ శరీరాలను వేరేవాళ్లకు అప్పజెప్పవద్దు. మీరు చేసే పనుల వల్ల పోలీసులకు తలనొప్పులు తీసుకురావద్దు. కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చద్దు. మద్యంలో మత్తులో.. డ్రగ్స్ మత్తులో ఎవరైన మిమ్మలని ఎత్తుకెళ్తే పోలీసులను అనోద్దు. అబ్బాయిలు ఎక్కువగా తాగోద్దు.. మితంగా తాగి ఎక్కువగా ఎంజాయ్ చేయండి అని ఆ వీడియోలో హెచ్చరించింది.