యువహీరో తో రష్మిక మందన్నా పెళ్లి…!
మీరు చదివింది నిజమే.. పుష్ప 2 మూవీ సూపర్ డూపర్ హిట్ తో మంచి జోష్ లో ఉన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరోతో ప్రేమలో ఉన్న సంగతి తెల్సిందే. ఇప్పటికే ఆ ఇద్దరూ చట్టపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి కూడా తెల్సిందే.ఆ హీరో ఎవరో కాదు రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ.
ఇదే అంశం గురించి పుష్ప 2 ఈవెంట్ లో రష్మికను అడిగితే మీకు ఎవరో తెల్సు.. ఆ వ్యక్తితో త్వరలోనే పెళ్లి.. ఇప్పటికే మేమిద్దరం ప్రేమలో తేలియాడుతున్నాము అని సెలవిచ్చారు. ఇదే అంశం గురించి విజయ్ దేవరకొండ సైతం క్లారిటీచ్చారు.
తాజాగా విజయ్ దేవరకొండ తో మూవీ చేస్తున్న ప్రముఖ నిర్మాత నాగవంశీ కూడా క్లారిటీచ్చారు. రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ ప్రేమలో మునిగితేలుతున్నారు. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారు. కొత్త ఏడాదిలో ఆ న్యూస్ మనం వినబోతున్నాము.. చూడబోతున్నాము అని చెప్పిన మాటల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.