నీతులు చెప్పడమే కానీ ఆచరించని పవన్ కళ్యాణ్…!
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోని రాజధాని నగరం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట సంఘటన గురించి దాదాపు ఇరవై ఏడు రోజుల తర్వాత మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ సంధ్య థియోటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందటం బాధాకరం.. శ్రేతేజ్ ఆసుపత్రి పాలవ్వడం విషాదకరం.. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలి.
ఈ సంఘటన జరిగిన రెండు రోజులకు హీరో అల్లు అర్జున్ కానీ పుష్ప మూవీ టీమ్ వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉండి ఉంటే ఇక్కడదాక వచ్చేకాదు. గోటితో పోయేది గొడ్డలి దాక తెచ్చుకున్నారు.ఈ సంఘటనలో మానవీయ కోణం మిసైంది అని అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విభిన్న స్వరాలు విన్పిస్తున్నాయి.పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమే.. పుష్ప టీమ్ పవన్ చెప్పిన మాదిరిగా రెండు రోజుల్లో రేవతి కుటుంబాన్ని పరామర్శి .. భవిష్యత్తుకు అండగా ఉండాల్సింది అని విశ్లేషకులు మేధావులు అంటున్నారు.
అదే సమయంలో పవన్ డిప్యూటీ సీఎం గా ఉన్న ఏపీలో కర్నూల్ జిల్లా ముచ్చుమర్రి లో అత్యాచారానికి గురై శవమే దొరకని బాలిక సంఘటనలో పవన్ కళ్యాణ్ ఇలాగే స్పందించి ఉంటే బాగుండేది.. ఏకంగా బాధితురాలి తల్లిదండ్రులు పవన్ ను వేడుకున్న ఇంతవరకూ పవన్ అటు దిక్కు చూడలేదు కాదు కదా కనీసం స్పందించలేదు…
సాక్షాత్తు తన సొంత నియోజకవర్గం పిఠాపురం లో అధికార కూటమి పార్టీలో ఒకటే కాదు ప్రధానమైన టీడీపీకి చెందిన ఓ యువనాయకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడితే ఖండించడం తప్పా అతనిపై చర్యలు లేవు.. కనీసం అటు వెళ్లి పరామర్శించింది లేదు.. మరి ఈ రెండు సంఘటనల్లో పవన్ చెప్పిన మానవీయ కోణం ఎక్కడ ఉంది.. పవన్ నీతులు చెప్పడమే తప్పా చేతలు లేవు అని .. నీతులు చెప్పినట్లు ఆచరించరు అని విమర్శలు వెల్లువడుతున్నాయి..