ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక నిర్ణయం..!
ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు..ఈ నిర్ణయంలో భాగంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తనను కలిసే అభిమానులు బొకేలు, పూలదండలు, శాలువాలు తీసుకురావద్దని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
వాటికి బదులు పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని ఆయన కోరారు. తనకు అభిమానులు నిండు మనసుతో చెప్పే శుభాకాంక్షలు చాలని పేర్కొన్నారు.
పెన్నులు, పుస్తకాలు ఇస్తే పేద విద్యార్థులకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ విధంగానైనా పేదలను ఆదుకోవచ్చని పేర్కొన్నారు.