మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు లో ప్రభుత్వం సొమ్ము పక్కతోవ పట్టింది అనే కారణంతో ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సంగతి తెల్సిందే.
ఇందులో భాగంగానే ఫార్ములా- ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది .. వచ్చే ఏడాది జనవరి 7న కేటీఆర్ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నది ..
మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు వెళ్లాయి .. వీరిని మాత్రం జనవరి 2,3 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో తెలిపింది.