తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త..!
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులకు ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తను తెలిపింది.
గత ఏడాదిగా తెలంగాణ రాష్ట్రం నుండి టీటీడీకి వెళ్తున్న సిఫారస్ లేఖలను తిరస్కరిస్తున్న టీటీడీ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంలో భాగంగా వారానికి రెండు రోజులు తెలంగాణ ప్రజాప్రతినిధుల నుండి సిఫారస్ లేఖలను అనుమతివ్వనున్నది. తెలంగాణ నుండి మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల నుండి సిఫారస్ లేఖలను స్వీకరించనున్నది.