మందుబాబులకు శుభవార్త..!
తెలంగాణ రాష్ట్రంలోని మందు బాబులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. మరో మూడు రోజుల్లో నూతన సంవత్సరం రానున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంలో భాగంగా డిసెంబర్ ముప్పై ఒకటీ తారీఖున ఆర్థరాత్రి పన్నెండు గంటల వరకు అన్ని రకాల మందు షాపులు తెరిచి ఉండటానికి అనుమతి ఇస్తూ ఆదేశాలను జారీ చేసింది.
అయితే డ్రగ్స్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని కూడా హితవు పలికింది. మరోవైపు బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ల పర్మిషన్లను ఒంటి గంట వరకు పొడిగించింది.