జనవరి లో 11 రోజులు సెలవులు..!
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని బడులకు జనవరి నెలలో కేవలం పదకొండు రోజులు మాత్రమే సెలవులు ఉండనున్నాయి. జనవరి ఒకటో తారీఖు నూతన సంవత్సరం ఉంది.
అదే విధంగా పదకొండో తారీఖు నుండి పదిహేడు తారీఖు వరకు సంక్రాంతి సెలవులున్నాయి. ఇవి మొత్తం ఎనిమిది రోజులు అవుతాయి..
ఈ నెలలో మరో మూడు ఆదివారాలు సెలవులు రానున్నాయి. దీంతో జనవరి నెలలో ఉన్న ముప్పై ఒక్క రోజుల్లో పదకొండు రోజులు విద్యార్థులకు సెలవులు అన్నమాట.