మాటలు తక్కువ.!. చేతలు ఎక్కువ…?
మన్మోహాన్ సింగ్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది మాట్లాడరు.. మాటలు తక్కువ అని.. నిజంగానే ఆయన ఎప్పుడు ఎక్కడ కూడా ఎక్కువగా మాట్లాడరు.. ఆయన మాట్లాడితే వజ్రాలే కాదు బంగారం కూడా ఊడిపడతాయేమో అని రాజకీయ వర్గాల్లో టాక్. కానీ చేతలు మాత్రం ఎవరి అంచనాలకు కూడా అందవు. అసలు ముచ్చటకి వస్తే చాలా మంది రాజకీయ నేతల్లా ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదు.
చేతల్లో పని చూపించే నాయకుడు. 1991లో తొలిసారిగా ఆయన రాజ్యసభలో అడుగు పెట్టారు. ఆ తర్వాత ఐదారు సార్లు పెద్దల సభకు అసోం రాష్ట్రం నుండి వెళ్లారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారి హాయాంలో ఆర్థిక మంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలను చేపట్టారు.
ఎన్ని యుద్ధాలు వచ్చిన.. మొన్న కరోనా వచ్చిన దేశ ఆర్థిక వ్యవస్థ నిలబడిందంటే నాడు పీవీ నేతృత్వంలో మన్మోహాన్ సింగ్ చేసిన సంస్కరణలే కారణం అని ఇప్పటికి వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన పీఎంగా ఉన్న సమయంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ అత్యధిక జీడీపీ 10.2% వృద్ధిరేటును నమోదు చేసుకుంది. వెనకబడిన వర్గాలకు ఇరవై ఏడు శాతం సీట్లు కేటాయింపు జరిగింది.