రూ. 100 కోట్ల కోసమా ఈ స్కెచ్..?
సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడమే కాకుండా శ్రీతేజ్ అనే బాలుడు తీవ్రంగా గాయపడి నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు పూర్తి బాధ్యులుగా హీరో అల్లు అర్జున్.. సంధ్య సినిమా హాల్ యాజమాన్యాన్ని చేస్తూ ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇదే కేసులో హీరో అల్లు అర్జున్ జైలుకెళ్లి మధ్యంతర బెయిల్ పై బయటకు కూడా వచ్చారు. తాజాగా చిక్కడపల్లిలో జరిగిన విచారణలో బన్నీ హాజరు కూడా అయ్యారు. అయితే ఈ సంఘటన గురించి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు… అభిమానులు సరికొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. పుష్ప మూవీ విడుదలై బాక్సాఫీసులను షేక్ చేస్తూ దాదాపు రెండు వేల కోట్లకు దగ్గరగా వసూళ్లను సొంతం చేసుకుంటుంది.
ఈ వసూళ్ల నుండి వాటా కోసమే హీరో అల్లు అర్జున్ ను ఇబ్బంది పెడుతున్నారని నెటిజన్లు… మేధావులు… ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఏది ఏమైన కానీ ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఆ కుటుంబానికి ఇటు హీరో తరపున.. అటు సినిమా యూనిట్ తరపున.. మరోవైపు ప్రభుత్వం తరపున అందాల్సిన సహయసహకారాలు అందిస్తున్నారు. కేసు విచారణలో ఉన్నందున మరిన్ని వాస్తవాలు బయటకు రావాలని అందరూ కోరుకుంటున్నారు ..