పోషకాహారలోపం వల్ల నష్టాలు ఏంటి..?
మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. మనం తినే ఆహారంలో ఏ పోషకాలు లోపించినా.. అవి వివిధ ఆరోగ్య సమస్యల రూపంలో మనకు కనిపిస్తాయి.
వాటిని గుర్తించి తగిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. మనలో పోషకాహారలోపం వల్ల శరీరం ఎలాంటి సంకేతాలను చూపిస్తుందో తెలుసుకుందాం.
” సాధారణంగా నిద్ర తక్కువైతే మనకు ఆవలింతలు రావడం సహజం. అలా కాకుండా కంటి నిండా నిద్రపోయినా పదే పదే ఆవలింతలు వస్తుంటే మన శరీరంలో ఐరన్ లోపించిందని అర్థం చేసుకోవాలి.
చేతులు, కాళ్ల కండరాల్లో తరచూ నొప్పి, కండరాల్లో తిమ్మిరి వస్తుంటే మెగ్నీషియం లోపం కారణం కావొచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు.
వెన్నులో, కాళ్లలో తరచుగా నొప్పి ఉంటే శరీరంలో విటమిన్-డి లోపం ఉన్నట్లు గుర్తించాలి. అలాగే తరచూ అనారోగ్యానికి గురి కావడం, ఆందోళన, డిప్రెషన్ వంటి వాటికి కూడా విటమిన్-డి లోపం కారణం కావొచ్చు.
” కొందరికి చేతులు, కాళ్లలో జలదరింపులా అనిపిస్తుంది. విటమిన్ బి12 లోపం వల్లే ఇలా జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ బి12 లోపం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతినటం, డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
” తరచుగా జలుబు బారిన పడుతుంటే అయోడిన్ లోపంగా గుర్తించాలి. ఇది హైపోథైరాయిడ్ లక్షణం. రక్తం లేకపోవడం, డయాబెటిస్, విటమిన్ బి12 లోపం కూడా తరచుగా జలుబుకు కారణం కావొచ్చు.
పైన చెప్పిన లక్షణాలు మీలో కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి వారి సూచనలను పాటించండి.