విచారణలో అల్లు అర్జున్ ను అడిగిన ప్రశ్నలివే..!
చిక్కడపల్లి పీఎస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు దాదాపు రెండు గంటల పాటు విచారించారు. ఈ విచారణలో పోలీసులు హీరో అల్లు అర్జున్ ను పలు ప్రశ్నలను అడిగారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. ఈ విచారణలో మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరూ సినిమాకు వచ్చారు..?. మీరు రావడానికి అనుమతి ఇచ్చారు అని ఎవరూ చెప్పారు.
ఏసీపీ,సీఐ మీదగ్గరకు వచ్చి సారు మీరు వెళ్లిపోవాల్సిందిగా కోరడం నిజం కాదా..?. సినిమా విడుదలైన రోజు రాత్రి 9.30 నుండి థియోటర్ లో ఎంతసేపు ఉన్నారు.?. తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిందని మీకు ఎప్పుడు తెలిసింది. ?. ఆ మహిళ చనిపోయినట్లు ఎవరూ చెప్పారు.?. మీరు దాదాపు ఎనిమిదోందల యాబై మీటర్ల దూరం ర్యాలీ ఎందుకు నిర్వహించారు. ?.
మీరు ప్రెస్మీట్ లో పోలీసులు నాదగ్గరకు రాలేదని ఎందుకు చెప్పారు..?. మీరు ర్యాలీలో చేయి ఎందుకు ఊపాల్సి వచ్చింది..?. అభిమానులపై దాడులు చేసిన బౌన్సర్ల వివరాలు చెప్పగలరా..?. మీతో పాటు వచ్చిన బౌన్సర్లు ఎక్కడ నుండి వచ్చారు.? అని ఇలా దాదాపు ఇరవై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తుంది.