అల్లు అర్జున్ ఇష్యూపై సీపీఐ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు…!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఓ ఊపు ఊపుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇష్యూపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ ” సంధ్య థియోటర్ ఇష్యూ అల్లు అర్జున్ వర్సెస్ ప్రభుత్వం అనేవిధంగా చర్చ జరుగుతుంది.
తొక్కిసలాటలో రేవతి మృతి చెందటం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకోవాలి. రాజకీయాల్లోకి సినిమా రంగాన్ని లాగకూడదు. సినిమాను సినిమాలాగే చూడాలి..
ఒకప్పుడు హీరోలను హీరోలుగా చూపేవాళ్లు.. సినిమాలన్నీ సందేశాత్మకంగా ఉండేవి. కానీ నేడు సినిమాల్లో సందేశాలకంటే చెడు ఎక్కువగా ఉంది. విలన్లను హీరోలుగా చూపిస్తున్నారు. ఇలాంటి ధోరణి మారాలని ఆయన అన్నారు.