అల్లు అర్జున్ నేషనల్ అవార్డు రద్ధు చేయాలి..!
Tollywood : పుష్ప మూవీకి గానూ ఇటీవల ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ అందుకున్న జాతీయ అవార్డును రద్ధు చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతికి.. ఓ బాలుడు ఆసుపత్రి పాలవ్వడానికి కారణమైన అల్లు అర్జున్ పై చట్టఫర చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ” పుష్ప మూవీ స్మగ్లర్లు,ఎర్ర చందనం దొంగలను ప్రోత్సహించి సమాజానికి చెడు మెసేజ్ ఇచ్చింది. కొత్త దొంగలను తయారు చేయడంతో పాటు పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసింది.
ఇలాంటి మూవీకి బన్నీకిచ్చిన జాతీయ అవార్డును రద్ధు చేయాలి. పోలీసుల మనోభావాలను దెబ్బ తీసిన దర్శకుడు సుకుమార్ పై కేసు పెట్టాలి. అరెస్ట్ చేయాలని ఆయన అన్నారు.