మోహాన్ బాబుకు బిగ్ షాక్…!
Tollywood: ప్రముఖ సీనియర్ నటుడు.. హీరో.. నిర్మాత మంచు మోహాన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. తన నివాసంలో జర్నలిస్ట్ పై దాడి సంఘటనలో ముందస్తు బెయిల్ కోసం మోహాన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై హీరో మోహన్ బాబు అదే మైకుతో దాడి చేసిన సంగతి తెల్సిందే. ఈ ఘటనలో రంజిత్ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దీంతో ఇప్పటికే పోలీసులు మోహాన్ బాబుకు నోటీసులు కూడా ఇచ్చారు. తాజాగా ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో మోహాన్ బాబును పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.