డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన..!
బంగ్లాదేశ్ దేశంలో ఉన్న హిందువులపై జరుగుతున్న దాడులను చూస్తుంటే బాధ కలుగుతోందని ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ను బంగ్లాలోని ఢాకా పోలీసులు అరెస్టు చేయడంపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
‘పాలస్తీనాలో ఏమైనా జరిగితే ప్రపంచమంతా మాట్లాడుతోంది. ఆవేదన చెందుతోంది. కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్న దానిపై ఎవరూ స్పందించట్లేదు’ అని అన్నారు.