భారీగా తగ్గిన బంగారం ధరలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 తగ్గి రూ.70,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,310 తగ్గడంతో రూ.77,240 పలుకుతోంది.
కేజీ వెండి ధర ఏకంగా రూ.2,500 తగ్గి రూ.98,000కు చేరింది. 9 రోజుల తర్వాత సిల్వర్ రేటు రూ.లక్ష దిగువకు పడిపోవడం గమనార్హం.