త్వరలో ఓ మాజీ మంత్రి అరెస్ట్..?
అధికారాన్ని.. పదవులను అడ్డు పెట్టుకుని పలు అవినీతి అక్రమాలకు పాల్పడిన ఓ మాజీ మంత్రి త్వరలోనే అరెస్ట్ అవుతారని ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ” ఐదేండ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీకి చెందిన నేతలందరూ కబ్జాలు .. అక్రమాలు చేశారు.
పలు అవినీతికి పాల్పడ్డారు. వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి.. ఆయన తనయుడు త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారని ఆయన అన్నారు.
తనపై వస్తున్న భూదందా వార్తలన్నీ తనంటే గిట్టనివాళ్ళే చేస్తున్నారు. నేను భూదందాలకు అక్రమాలకు పాల్పడినట్లు నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పిన కానీ వైసీపీ నేతలు తమ తీరు మార్చుకోవడం లేదని ఆరోపించారు.