యూట్యూబర్లకు హరీష్ రావు విన్నపం..!

యూసఫ్ గూడా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన డిజిటల్ మీడియా ప్రీమియర్ లీగ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు.. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ డిజిటల్ యుగంలో ప్రతి రోజూ పోటీ ఉంటుంది. అందరూ కలిసి ఇక్కడ లీగ్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. రాజకీయనాయకులు లాగానే మీరు ఎంతో శ్రమిస్తారు. ఇలాంటి గేమ్స్ వల్ల మీకు ఒత్తిడి తగ్గుతుంది.
టెక్నాలజీ వల్ల పత్రికలు చదవటం, టీవీలు చూడటడం కొంత తగ్గి ఆ స్పేస్ ని మొబైల్ ఫోన్లు వచ్చాయి.థంబ్ నెయిల్స్ ఒకటి, లోపల ఒకటి ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే వాస్తవానికి దగ్గరగా ఉండాలని, ఆ దిశగా ఆలోచించాలని కోరుతున్నాను.థంబ్‌నెయిల్స్ వాస్తవానికి దగ్గరగా పెట్టండి.. యూట్యూబర్స్‌కి నా చిన్న రిక్వెస్ట్..
థంబ్‌నెయిల్స్ ఒకటి, లోపల ఒకటి ఉంటుంది. అయితే చాలా మందికి లోపల చూసే ఓపిక లేక థంబ్‌నెయిల్ చూసి నిజం అనుకుంటారు..అందుకని సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని థంబ్‌నెయిల్స్ వాస్తవానికి దగ్గరగా ఉండేలా పెట్టండని కోరుతున్నా ను అని అన్నారు..